ఒకప్పుడు సంక్రాంతి మూడు రోజుల పండుగ
గంగిరెద్దులను ఆడించుకుంటూ
గంటసాల పాటలను సన్నాయిల్లో వాయించుకుంటూ
డమరికములు,మద్దెలల చప్పుళ్లతో
ఊరు ఊరంతా బహుసందడిగా ఉండేది
కనుల విందుగా గంగిరెద్దుల తైతక్కలు బహుసుందరంగా ఉండేవి
ఇంటి వాకిట్లోకి వచ్చారంటే సన్నాయి వాయిస్తూ
అయ్యవారికి దణ్ణం పెట్టు అనగానే కుడికాలు పైకెత్తి గంగిరెద్దు నమస్కరిస్తుందా అని ఆశ్చర్యపోయేవాళ్ళు
అలాగే అమ్మగారికి దణ్ణం పెట్టు అనగానే ఎడమ కాలు పైకెత్తేది
పొట్టదొరసాని పాపను కంటుందా!? తల అడ్డంగా ఉపేది !!
పిల్లోన్ని కంటుందా!? తల అవునన్నట్లు ఈ వైపున ఉపేది !!
సంక్రాంతి రోజైతే గంగిరెద్దులను బజార్ల వెంట పరుగులెత్తిస్తూ ఆడించే వాళ్ళు
ఆ సన్నాయి పాటలు వీణుల విందుగా ఉండేవి
ఈ అనంత కాలం వేగంగా మారుతు వృత్తులు ప్రవృత్తులు కదలిపోతున్నాయి
మామూలు పండుగలు పబ్బుల్లో కూడా గంగిరెద్దుల వాళ్ళు డోలు దరువులు సన్నాయిలు వాయిస్తూ వచ్చేరోజులు అవి
కాలం అన్ని వృత్తుల మాదిరిగానే గంగిరెద్దుల వాళ్ళు
వాళ్ళ వృత్తిని వదలి కూలినాలి చేసుకుని పొట్టపోసుకునే పరిస్థితి
ఇదివరలో పశువులు ఉల్లల్లో మందలు మందలుగా ఉండేవి
వ్యవసాయంలో యాంత్రీకరణ మొదలవగానే
అన్ని వ్యవసాయ పనులు యంత్రాలే చేస్తున్న రోజులు
చాలా వరకు పశువులన్నీ కబెలాల పాలయ్యాయి
పాలిచ్చే పశువులే పల్లెల్లో బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నాయి
ఇక గంగిరెద్దులనే వాటి శిక్షణ కరువైంది
అడపా దడపా కొన్నిచోట్ల ఈ గంగిరెద్దులను ఆడించినా
ఈ సినిమాలు టీవీలు ఈ ఈలలు కేకలు బొబ్బల్లో ఆదరణ కరువైంది
వీళ్ళు వచ్చినా ఎవడో అడుక్కునే వాళ్ళు వచ్చారంటున్నారు
ఒకప్పుడు ఇంటిముందుకు వస్తే గాదెళ్లలోని ధాన్యం కానుకగా ఇచ్చే రోజులు రావిక
అంతా సైన్స్ టెక్నాలజీలతో కదలి కదలి కాలగర్భంలో కలిసిపోయే రోజులు,,,,,,!!!?!!!
అపరాజిత్
సూర్యాపేట