నేటికీ సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారికి శుభాకాంక్షలు
మన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తన సంవత్సర పదవి కాలంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి ఆదేశానుసారం నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చిన అండగా ఉంటూ నిత్యం వారి సమస్యలను తెలుసుకుంటు వారి సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తున్నారు. అలాగే అలంపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల కళ అయిన మల్లమ్మ కుంట,జులేకల్,వల్లూరు రిజర్వాయర్ల ఏర్పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందీ. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాటి ఏర్పాటుకు కృషి చేస్తామని తెలపడం కూడా జరిగింది.అలాగే తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ద్వారా పంట పొలాలకు ప్రభుత్వంతో కొట్లాడి నీళ్లను విడిపించి సాగునీటి అందించిన ఘనత ఎమ్మెల్యేకు దక్కింది. ప్రతి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎల్ఓసిలు ఇవ్వడం, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం నిత్యం జరుగుతూనే ఉంటుంది. గెలిచిన సమస్య కాలంలోనే ఎమ్మెల్యే విజేయుడు నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపుతో ప్రజల మందనాలను పొందుతున్నాడు.
ఇలాగే ఈ ఐదు సంవత్సరాల పదవి కాలంలో నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చిన వారికి చేదోడు వాదోడుగా నిలిచి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే విజయుడు గారు ఇంకా ముందు ముందు మరిన్ని ప్రజలకు అంది ఇవ్వాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజల పక్షాన హార్దిక శుభాకాంక్షలు