పుష్ప ఫలములతో
శాఖోప శాఖలుగా
విస్తరించిన మాహావృక్షాన్ని నేను
మానవ పైశాచికతకు
కాల పరీక్షకు ఎదురీదుతూ
నిట్టనిలువునా చీల్చినా నిలిచాను!
వేటగాడు మాంసం ఎరగా వేసి
సింహాన్ని ఉరికంబానికి
వేలాడదీసి చీల్చుకుతింటూ
పైశాచిక ఆనందం మానవ నైజం!,
అడవులలోని క్రూరమృగాలను
సాధుపుంగవ జంతుజాలం
మానవ క్రూరత్వంలో బలి!
రంగు రంగుల పూవులు పండ్లు
ఆకాశం నిండా ఎదిగిన
మహావృక్షాలను పెడబొబ్బలతో
అడవి అంతా తల్లడిల్లిపోగా
ఖండఖండాలుగా నరికీన
దానవుడు మానవుడు
అడవి అంతా కాలీకూలిపోయింది
దాని అడుగులోనే ఫ్యాక్టరీలు వెలిశాయి,,,,,!
ఇప్పుడు ఇక్కడ సెలయేరులు లేవు
కొండలు గుట్టలు మాయం దూకే జలపాతాలు కనుమరుగయ్యాయి
అడవితల్లి బోరున విలపిస్తూ
గుండెలు పగిలి మరణించింది!
ఆదివాసీలు ఆకలి కోసం
జనం జాతరలో కుదేలు అయ్యారు
ఇప్పుడు కొత్తగా కాలనీలకు
కాంక్రీటు ఇళ్లకు నిలయం కాబోతోంది
నా జంతు పక్షిజాలాన్ని
రక్కసుల కోరల మధ్య
తోలు వలిచి కాల్చుకుతిని
తాగుతూ పిశాచాళ్ళా నర్తించే
నరవానర యమకింకరులు,,,!
ఇవన్నీ వీక్షించే దేవతలు తెల్లబోతున్నారు
అదను చూసి ప్రళయరుద్రులై
శివుడు మూడోకన్ను తెరిస్తే
పార్వతీ పరమేశ్వరులు ప్రళయతాండవం
చేయడానికి సిద్ధంగా ఉన్నారు
భూకంపాలు సునామీలు తుఫాను గాలులతో
చండప్రచండంగా మానవ ధర్మం కోల్పోయిన
లోకమంతా పిశాచాలు పీక్కతిన్నట్లు
రకరకాల వైరసులు,భయంకర రోగాలతో
ప్రళయరుద్రుల కళ్ళతోనే
భూలోకమంతా మానవ శవాల దిబ్బలపై
సాధుపుంగవుల ప్రేమ దయ కారుణ్యంలో ఆహ్లాదకర ఆనంద లోగిలి
భూలోకం కాబోతుంది
రంగు రంగుల పూవుల్లా పక్షులు
మానవ జంతు సమూహాలతో
కలిసి మెలిసి జీవజలములతో
వెల్లువెత్తిన ఆనందాల లోగిలి
ఈ కాబోయే వినూత్న భూలోకం!
ఇది కల కళల సముద్రాల నిలయం,,,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
![](https://telanganasakshi.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-10-at-8.13.18-PM-631x1024.jpeg)