నేను నా మనస్సు పూసిన పూజకు అర్పించే సన్నజాజి పుష్పమో
కొంటె పాటలు పాడే ఆదివాసీలు దేవతకు అర్పించే అడవి పూసిన రేల పుష్పమో
ఆనందాల అందాల సురభామినులు పూలసజ్జలో తీసుకెళ్లి ఆ దేవాదిదేవునికి అర్పించే సిరిమల్లె పూవుల సుగంధ మాలికయో
లిప్తమాత్రమైనా కాలం సడలిపోకుండ దైవ సేవ మానకుండా పూజలు చేసే పూజారి కరకమలాలో లీనం చేసిన
నా జీవితంలోని ఉషస్సులన్నీ కోల్పోయిన నడివయస్సు దాటి తేలిపోతున్న దుఃఖ సముద్రాలలో కెరటాలనో
మంచుకొండల్లో కాచే ఎండల్లో నటరాజు నర్తనంలో మునకలేస్తున్న శివుని అర్దనారీశ్వరుని రూపాన్నో
మిగిలిపోయిన కార్యాలను కాలం కళ్ళల్లో నా మారిపోతున్న రూపంలో నైనా స్వేచ్ఛను పొందుటకు చేసే యజ్ఞం ఫలవంతం కావాలని కోరే నరుని అక్షరాన్నో
ఈ శీతల పవనాలు నాలోని వింతైన దైవిక స్వప్నాలను అక్షరీకరించి అర్పించే అక్షరాల చిరాపుంజిలో విరిసిన కవితా సుమాన్నో
ఈ పౌర్ణమి రోజున జరిగే పండుగలలో వెన్నెలలు కురిసిన చందం సూరీడు శీతలంలో విరిసిన లేత ఎండల పగటి పూట పూసిన ఎర్రని మందారాన్నో
భువిపై నాగేటి చాల్లలో ఉదయించి జీవితంలో కన్నీళ్ల కడగళ్ళ వడగళ్ల వర్షంలో ముగిసిన సీతమ్మవారి దుఃఖిత హృదయాన్నై భూమిలో కలిసిపోయిన అస్థికనై ఉంటాను కాబోలు,,,,,,,!!?!!
అపరాజిత్
సూర్యాపేట
ఓ రాతి పూల స్వప్నాలు,,,,,!!
RELATED ARTICLES