సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరి గ్రామంలో కాలేశ్వరం నీటితో గ్రామ చెరువుల నింపాలని రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రైతులు రోడ్డుపై బైఠాయించి తమ పంటలు ఎండిపోతున్నాయని తమపై దయవుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ చెరువులోకి నీటి విడుదల చేసి తమ పంటలను కాపాడాలని లేనిపక్షంలో ధర్నాను ఉధృతం చేసి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు
తలాపునే గోదారి మా గ్రామ పంట పొలాలు ఎడారి అనే నినాదంతో రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. సిద్దిపేట దగ్గరలోని రంగనాయక సాగర్ ఎడమ కాలువ పుల్లూరు గ్రామం నుండి దాదాపు తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ కాలువ కోసం కొన్ని వందల ఎకరాలు రైతులు తమ పంట పొలాలను వదులుకొని ప్రభుత్వం ఎంత ఇస్తే అంత పరిహారం తీసుకొని మన పంట పొలాలు పోయిన మిగతా వాళ్ళందరి పొలాలు సస్యశ్యామలం అవుతాయని గ్రామ చెరువులు నిండి ప్రజలు సంతోషిస్తారని మా భూములు వదులుకుంటే మా పుల్లూరు గ్రామం పై ప్రభుత్వం శీతకన్ను వేసిందని మా గ్రామ చెరువులోకి చుక్కనీరు కూడా రాకుండా పోయిందని తద్వారా కాలువల్లో జాగా పోయిన పొలాల రైతులు బాధపడుతున్నారు ఈ విషయమై మా గ్రామ చెరువు నింపడం కోసమే ఇరిగేషన్ ఏఈకి డి ఈ కి జిల్లా కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మార్వో గారికి ఎన్నో వినతి పత్రాలు అందించిన ఎలాంటి ప్రయోజనం లేదని రాజకీయ నాయకులకు అధికారులకు విన్నవించిన ఎలాంటి స్పందన లేదు కాబట్టే పార్టీలకతీతంగా రైతులందరూ ఏకమై ధర్నా కార్యక్రమం చేపట్టామని తమ గూడు విని ఇప్పటికైనా ప్రభుత్వం మల్లన్న సాగర్ కాల్వ ద్వారా త్రీ ఆర్ కాలువ ఇరుకోడు చిన్న గుండెవెళ్లి పుల్లూరు రామంచ వరకు కాల్వ సాంక్షన్ అయి ఉంది కాబట్టి ఆ కాలువను త్వరగా పూర్తిచేసి మా రైతులను ఆదుకోవాలని గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ధర్నా చేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా రైతుల ని ఆదుకోవాలని విన్నవించారు
