క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటుపడి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు, రూ 8,00,000/- విలువ కలిగిన నగదు స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు.
నేరం జరిగిన విధానము: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలములో గల ఉప్పుగుండూరు గ్రామములోని కొణిజేటి సురేష్ బాబు అను అతను శనగల వ్యాపారం చేసుకుంటూ వుంటాడు, నేరస్తులు అతని మేనల్లుడులాగా ఫోన్లో మాట్లాడి అతనిని నమ్మించి, వారు ప్రేవేట్ కంపెనీ పెడుతునట్లు దానికి డబ్బులు అవసరమని ఇస్తే తిరిగి ఇస్తామని నమ్మించి మోసము చేసి అతని వద్ద నుంచి పలు మార్లు ఫోన్ ఫే ద్వారా రూ 8,34,000/- మని ట్రాన్సాక్షన్ పాయింట్ కు ఆన్లైన్ లో నగదు బదిలీ చేయించి తరువాత ఆ డబ్బులను డ్రా చేసుకున్నారు.సదరు పిర్యాదుపై Cr.No186/2024 U/s 319(2), 318(4) BNS నాగులుప్పల పాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయబడి దర్యాప్తు లో ఉన్నది.
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్ ఐపీఎస్ గారి స్వీయ పర్యవేక్షణలో, ఒంగోలు ఎస్‌డిపిఓ శ్రీ రాయపాటి శ్రీనివాస రావు గారి నిర్దేశంలో, ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీకాంత్ బాబు మరియు వారి సిబ్బంది అయిన నాగులుప్పల పాడు ఎస్సై బి.శ్రీకాంత్ మరియు వారి సిబ్బంది, PC 450 పి రాఘవులు, PC 3628 డి. తిరుపతిరెడ్డి, HG 590 ఎస్ రవి కుమార్ రెడ్డి ల సహాయంతో ఈ క్రింది తెలియజేసిన నేరస్తుల్ని పట్టుకొని, వారిని నాగులుప్పల పాడు ఎస్సై బి.శ్రీకాంత్ గారు తేదీ 09.01.2025 న 10.30 గంటలకు అరెస్ట్ చేయడమైనది.
అరెస్ట్ కాబడిన ముద్దాయిల పేర్లు:
- కోట విజయకృష్ణ,S /O సత్యన్నారాయణ , 32 సంవత్సరాలు,కమ్మ కులం, కోప్పరపాలెం గ్రామము,బల్లికురవ మండలం
- చిక్కాల దొమ్నిక్ చక్రవర్తి ,S /O రమేష్ బాబు , 19 సంవత్సరాలు, మాల కులం, సాలింనగర్ ,నరసరాపేట మండలం,పల్నాడు జిల్లా .
స్వాధీనం చేసుకున్న నగదు వివరాలు :–
ముద్దాయిల యొక్క నేరం ఓప్పుకోలునామా ప్రకారం క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటుపడి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలములో గల ఉప్పుగుండూరు గ్రామములోని కొణిజేటి సురేష్ బాబు అను అతనికి ఫోన్ ద్వార అతని మేనల్లుడులాగా ఫోన్లో మాట్లాడి అతనిని నమ్మించి, పలు మార్లు ఫోన్ ఫే ద్వారా, మోసగించిన తీసుకున్న సొమ్ము తో బెట్టింగ్స్ కోసం గోవా కు వెళ్తున వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మోసాలకు పాల్పడిన రూ 8,00,000/- నగదును స్వాధీనము చేసుకోవడమైనది. వీరిలో కోట విజయకృష్ణ అనే అతను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2017 నుండి ఫోన్ పే లో ఒక నెంబరు కొట్టి వారిని మామయ్య అని పలకరించి తన మేనల్లుడు అని పరిచయం చేసుకొని విజయనగరం కృష్ణాజిల్లాలలో ఆరు కేసులలో ఇప్పటికే అరెస్టు కాబడి ఉన్నాడు.
అభినందనలు: కేసులో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీకాంత్ బాబు, నాగులుప్పల పాడు ఎస్సై బి. శ్రీకాంత్, నాగులుప్పల పాడు, PC 450 పి రాఘవులు, PC 3628 డి. తిరుపతిరెడ్డి, 590 ఎస్ రవి కుమార్ రెడ్డి తదితర సిబ్బందికి ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులను ప్రకటించినారు.
ఎన్. శ్రీకాంత్ బాబు సిఐ
ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్