జల్లాపురం గ్రామ సామాజిక కార్యకర్తల కృషితో చేతి బోరు పంపులు రిపేర్

ప్రజావాణి దరఖాస్తుకు స్పందించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారుజిల్లా DPO గారు జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో ఉన్న దళిత వాడలో పైగేరిలో ఉన్న చేతి బోరు హెడ్ పూర్తిగా విరిగి పోవడంతో 6 నెలల పాటు ఉపయోగంలో లేదు అలాగే క్రింది గేరిలో ఉన్న చేతి బోరు పంపు పైపులకు రంధ్రాలు పడటంతో నీలు రానందున ఈ కాలనీ వాసులు త్రాగడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇదే గ్రామానికిచెందిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు శాంతకుమార్ గారు బోరెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి గారు నీటి సమస్యపైన ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వగా వెంటనే అడిషనల్ కలెక్టర్ గారు DPO గారితో చర్చించడం జరిగింది. మండల MPDO , పంచాయతి కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు చేతి బోరు పంపులు రిపేర్ చేపించడం జరిగింది. త్రాగు నీటి సమస్యను తీర్చిన సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి DPO గారికి దళిత వాడ ప్రజలు సంతోషం వ్యక్తపరిచి కృతజ్ఞతలు 🙏🏽🙏🏽తెలిపారు. అలాగే నీటి సమస్యను ప్రజావాణి దృష్టికి తీసుకెళ్లిన సామాజిక కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ 💐 మండల ఎంపీడీవో గారికి గ్రామపంచాయతీ కార్యదర్శి గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular