ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు సంతాపం ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. జగదీష్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జగదీష్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీకి ఆయన అందించిన సేవలను మంత్రి కేటీఆర్ స్మరించుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో, పాటు పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడిగా సేవలు అందించారని అన్నారు. ఈ మధ్యనే తాను ములుగు జిల్లాలో పర్యటించినప్పుడు అత్యంత చురుకుగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న జగదీష్, ఆకస్మికంగా మరణించడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన మరణం బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబానికి మరియు జిల్లాకి తీరని లోటు అన్నారు. జగదీష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
RELATED ARTICLES