వివేకానంద మానవతావాది
సర్వమతాల సారమే హిందూమతమని నమ్మాడు!
రామకృష్ణుల వారి శిష్యరికంలో
ఆధ్యాత్మికంగా మహోన్నత శిఖరాల కెదిగాడు
దేశానికి కావలసింది ఇనుప నరాలు ఉక్కు కండరాలు గల యువత !
నీ లక్ష్యం శిఖరమే ఆయితే
ఎన్ని శ్రమలకోర్చి యైన సిద్దింప చేసుకొమ్మన్నాడు!
అమెరికా సర్వమత సమ్మేళనంలో
సోదర సోదరీ మణులార అని సంబోదించి ప్రసంగం మొదలిడితే
ప్రాశ్చాత్యులకు చిత్రంగా తోచి నిలబడి చప్పట్లు కొట్టారు!
దేశంలో కరువు కాటకాలు ఆకలి చావులను చూసి చలించిపోయాడు
రామకృష్ణ మిషన్ ద్వార సామాజిక సేవలందించాడు!
చిన్నప్పటి నుంచే హిందూమత గ్రంధాలు ఆంగ్ల గ్రంధాలను అధ్యయనం చేశాడు
భగవత్ గీత చదవాలా? ఫుట్ బాల్ ఆట నేర్వాలా? అని సంశయం వద్దు
ఫుట్ బాల్ ఆటే ముందు నేర్చుకో
అప్పుడే అనుభవ పూర్వకంగా భగవత్ గీత నేర్చుకుంటావు!
యువత చమటలు చిందించనిదే నవభారత నిర్మాణం జరగదు
నలబై ఏళ్ళ వయసులోపే ప్రపంచంలో
పెద్ద పెద్ద దేశాల్లో ఉపన్యసించాడు!
నరాలను ఉద్రేక పరిచే ఆయన ప్రవచనాలు
యువతరానికి పెను సవాల్లు విసిరేవి!
నిరుపేదలు అభాగ్యులు మనుషులేనని మరువకు
వాళ్ళను చీదరించుకుంటే నీలోని మనిషి చచ్చినట్లే!
వివేకానంద హిందూమతంలో ఉన్న గొప్ప ఔన్నత్యం
మానవత్వాన్ని అధికంగా ప్రేమించాడు!!
అపరాజిత్
సూర్యాపేట