ఈ జీవితంలో ఉషస్సులన్నీ ఇట్టే కనుమరుగైపోతున్నాయి. కాల చక్రం గిర్రున తిరుగుతూ వడివడిగా కదిలిపోతోంది. మానవుల వేడి కన్నీళ్లు పాయలుగా తరలి వెళ్తూ వెచ్చని సముద్రాలు అవుతున్నాయి. దివారాత్రులు శ్రమించినా కూటికి నోచుకోని వాళ్లేందరో దురవస్థల పాలై కాళికాలం మింగేస్తోంది. వెండి వెన్నెలలు బైరాగుల పాటల పాలయ్యాయి. సరస సల్లాపాలు కొందరికే పరిమితం. విద్య వైద్యం ఖర్చులు భరించలేని నిరుపేదలు దినసరి కూలీలు. భార్యాభర్తలు బూతులతో తన్నుకుంటూ అగ్ని కురిసే ఎండమావుల బ్రతుకులు. ఏవి ఎక్కడ కంప్యూటర్ లు రోదసీ రాకెట్లు !?ఈ కన్నీళ్ల బ్రతుకుల్లో వెలుగుల పున్నమలు పండుగలు అడవిలో మానులు.వీళ్ళను కన్నీళ్ల ఊబిలోంచి లాగడం ఎవరి తరమూ కాని విషాద నిశీధి ఘంటికలు.అవిగో.ఆకాశం నిండా ఎర్రని మంటల మబ్బులు,,,,,!!
అపరాజిత్
శ్రమల కన్నీళ్ల గోస,,,,,!!
RELATED ARTICLES