వైద్య శిబిరాన్ని నిర్వహించిన లీత చారిటబుల్ ట్రస్ట్, ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ
ముఖ్యఅతిథిగా పాల్గొన్న తుంగతుర్తి రవి, ట్రస్ట్ సభ్యులకు అభినందనలు
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పర్వతాపూర్ సాయి ప్రియ కాలనీ రోడ్ నెంబర్ 05 లో లీత చారిటబుల్ ట్రస్ట్, ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లీతా చారిటబుల్ ట్రస్ట్ పెద్దలు డాక్టర్ చిరంజీవి, డాక్టర్ కమల చిరంజీవి, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 300 మందికి బిపి, షుగర్, రక్త పరీక్షలు, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీలతో పాటు గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వైద్య చికిత్సలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా భావించి లీత చారిటబుల్ ట్రస్ట్, ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఫౌండేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
