సుప్రీంకోర్టులో కేటీఆర్కు దక్కని ఊరట ఫార్మూలా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్కు వరుస షాకులు తగులుతున్నాయి. కేటీఆరు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. క్వాష్ పిటిషన్ను రేపు (శుక్రవారం) విచారణకు తీసుకునేందుకు నిరాకరించింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 15న విచారణ చేపట్టనుంది.