మల్దకల్ (డిసెంబర్ 14) మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం శ్రీనివాసుని ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి హంస వాహనంపై శ్రీ తిమ్మప్ప స్వామి తేప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందలాదిమంది భక్తులు పుష్కరిణిలో శ్రీనివాసుని తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు ఏవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు హాజరయ్యారు.
కన్నుల పండుగ శ్రీ తిమ్మప్ప స్వామి తెప్పోత్సవం
RELATED ARTICLES