వైఎస్ కుటుంబంలో విషాదం.. మాజీ సీఎం జగన్ తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూతవైఎస్ కుటుంబంలో విషాదం.. మాజీ సీఎం జగన్ తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం.. జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అభిషేక్ రెడ్డి మరణంపై వైఎస్సార్‌సీపీ నేతలు సంతపాన్ని తెలియజేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థీవ దేహాన్ని పులివెందులకు తరలించారు.. అంత్యక్రియలను ఇవాళ నిర్వహిస్తారని తెలుస్తోంది. వైఎస్ జగన్ కూడా పులివెందుకు వెళాతరని చెబుతున్నారు. అభిషేక్ మరణంతో వైఎస్ కుటుంబంతోపాటు వైఎస్సార్‌సీపీలోనూ తీవ్ర విషాదం అలుముకుంది.