పల్లె పండుగ వారోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆకట్టుకున్న స్టాళ్లు ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు. ప్రభుత్వ పథకాల సమాచారం సమాహారంతో స్టాళ్ల ఏర్పాటు. హరిదాసు కీర్తనలు ఆలకిస్తూ.. పిట్టలదొర కబుర్లు వింటూ.. మత్స్య సంపద వివరాలు తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధ్యయనం చేస్తూ.. ప్రభుత్వ శాఖల సమన్వయంతో వివిధ వర్గాల ప్రజలకు అందుతున్న సేవలపై పరిశీలన చేస్తూ.. అధికారులను అడిగి సందేహాల నివృత్తి చేసుకుంటూ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకర్గ కేంద్రంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో నిర్వహంచిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. హరిదాసు కీర్తనలు ఆస్వాదించారు. పిట్టల దొరల కోతలు, జంగమదేవరల జోస్యాన్ని ఆసక్తిగా ఆలకించారు. సంక్రాంతి పండుగ వేళ హరిదాసుకు బియ్యం వేసి మన సంస్కృతి, సంప్రదాయాలపై తనకున్న మక్కువను చాటుకున్నారు…
®️ప్రగతి పథం.. ప్రభుత్వ ప్రణాళికల అమలుపై అధ్యయనం!!
RELATED ARTICLES