అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్రూ .1033 కోట్లతో శబరిమల మాస్టర్ ప్లాన్, ఇక ఆ సమస్యలకు చెక్,అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.1033.62 కోట్లతో శబరిమల మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కేరళ మంత్రివర్గం తాజాగా ఆమోద ముద్ర వేసింది. సన్నిధానం, పంబ, ట్రక్ రూట్ సహా కీలక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 3 దశల్లో శబరిమలను అభివృద్ధి చేయనుంది. అయితే ఈ శబరిమల అభివృద్ధి సందర్భంగా ఎలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతకు భంగం కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తాజాగా కేరళ ప్రభుత్వం వెల్లడించింది