ఈ రాత్రి మసకేసిన మబ్బుల్లో
అక్షరాలు తిమిరాల్లోకి జారుకుంటున్నాయా!?
ఈ అర్ధరాత్రి అక్షరాలు కారుమేఘాలు మింగిన నక్షత్రాలలా తాత్కాలికమేనా
మూగబోయిన ప్రకృతి అందాలను
వర్ణించేందుకు అక్షరాల ఊట లేని కలం
కాలం ఒడిలోకి జారుకుని కంప్యూటర్ అవతారమెత్తిందా!?
మొక్కవోని దీక్షతో అక్షర పఠనం చేసే చదువరి
జోగునిద్రలోకి జారుకున్నాడా ఏమి!?
నా అక్షరాలన్నీ ఇక నిరీక్షించ లేక విలపిస్తూ
పఠనం లేని అనాధల మయ్యామని గొల్లుమంటున్నాయి
కళ్లనీళ్లు ఒత్తుకుంటూ కంగారుపడకండి
తాత్కాలికంగా మరుగున పడిపోయిన
పద్యాలు వచన కవితలుగా ఉద్గ్రంధాలు కథలు వ్యాసాలుగా అవతరించి
కవుల రచయితల అక్షరాలు సూదంటు రాళ్ళలా
కుశాగ్రబుద్ది చదువుల పాలిట కల్పతరువులు అవుతున్నాయి
అదిగో సాహితీ సముద్రం అక్షరాల అలలు
చరవానుల నిండా అక్షరాల నున్నని కురులే
అక్షరాల తెల్లని పేజీలు బదులు చేతుల్లో ఇమిడే రంగుటద్దాలపై తేలియాడే
నవయుగం రంగురంగుల కళ్ళు పఠించే చరవానులు, కంప్యూటర్ లు, లాబ్ టాబ్ లుగా అవతరించాయ్
కృత్రిమత్వంలో మునిగితేలడమే సత్యం ఇప్పుడు
అనాది అనంతంగా మార్పులకు లోనై
అనంతమైన జనజాతరలో కృత్రిమ హంగులు ఆర్భాటాల మధ్య
జీవితాలలో కోరికల విమానాలెక్కి
మందు మాంసం మెడనేసుకుని మారుతీ నర్తనం చేస్తున్నాడు
ఎప్పుడు కూలిపోతాయో తెలిసే ఇంద్రభవంతుల్లో
కాపురాలు కొల్లేరులై ఒకప్పటి ఆటవిక సంస్కృతి అరుదెంచిన కళికాలం
జనజీవనం ఉరుకులు పరుగుల రంగుటద్దాలపై
ఎప్పటి కప్పుడు తుడిచివేసే అక్షరాలు కళ్ళనిండా నిషాలో ఉన్నాయి
ఒక్కో అక్షరం పేకమేడల్లా కూలిపోయే
వెర్రిమొర్రి సినిమా పాటలు కథలు డైలాగులు
అర్థం పర్థం లేని జోకులు వ్యంగ్యం నింపుకున్న మాటలు
జనజాతర నోళ్ళల్లో కమ్మటి యాసిడ్ లాంటిది పోసి నాలుకల కుత్తుకలు తెగ్గోస్తున్నారు
ఆత్మహత్య చేసుకున్న శవాలను లేపి మోటారు వాహనాలలో పోష్టుమార్టం చేసి కృత్రిమ జీవం పోస్తున్నారు
వైరస్ లు కరోనాలు క్యాన్సర్ లు శవాలదిబ్బలపై
కాలనీలకు పునాదులై దొంగ దేవుళ్ళ రాజ్యాలయ్యాయి
ఇప్పుడు అక్షరం ఉన్మాదియై అతీగతీ లేని
అక్షరాలను అంధకార జైలులో రోజుకోటి ఉరితీసి
వెలకట్టి వేలం వేసి ఆ డబ్బులతో
రంగు రంగుల కార్లలో ఆడమగ తేడాలేని మానసిక రోగులైనామనే ధ్యాసే లేదు
అక్షరం ఉన్మాదులు చెరిచిన జీవం ఆనవాళ్లు లేని వింతల ప్రపంచ సుందరి,,,,,,,!!?!!
అపరాజిత్
సూర్యాపేట