ములకలపల్లి ఆగస్టు 04 ప్రతినిధి:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవమును పురస్కరించుకొని ప్రతి గడపగడపకు ఘనంగా తొమ్మిది రోజులు పాటు ఆదివాసి ఉత్సవాలు ప్రతి గ్రామం లో జరుపుకోవాలని రాష్ట్ర కమిటీ లో బాగంగా ఆదివాసి విద్యార్థి సేన మండల కో కన్వీనర్ కొడిమే చిరంజీవి మండలంలో బొంతగుడెం ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆదివాసీలకు ప్రత్యేకగా గుర్తుగా ఆగస్టు 9న ఆదివాసి దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు తారతమ్యాలు లేకుండా ఆదివాసీలందరూ ఏకమయి ప్రతి గ్రామంలో సగౌరవంగా జెండా ఎగరవేసి ఆదివాసీల ఆస్తిత్వాన్ని ఉనికిని సాంస్కృతి సాంప్రదాయలను కాపాడుతూ ఆత్మగౌరవంతో ఆకు పచ్చ జండా ఎగరవేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి మన పోరాట వీరుల చరిత్రను చట్టాల హక్కుల గురించి చైతన్యం చేస్తూ గ్రామాలలో తిరుగుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఎవరు గ్రామంలో వారి పెద్ద మనుషులు ప్రజాప్రతినిధుల సహకారంతో ఎగరవేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సేన ములకలపల్లి మండల కో కన్వీనర్ కోడిమే చిరంజీవి,కీసరి వినోద్ కుమార్,తానం దేవయ్య,కీసరి కన్నారావు,కీసరి రాజులు,కీసరి వెంకటేష్,తాటి సింహాద్రి తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.