అనకాపల్లి రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా తీర్చి దిద్దండి.

గోదావరి,తిరుమల ఎక్సప్రెస్ కు రెండు అదనపు జనరల్ బోగిలు కేటాయించండి

సౌత్ సెంట్రల్ రైల్వే 74వ జోనల్ రైల్వే యూజర్స్ కమిటీ మీటింగ్ లో జెడ్.ఆర్.యూ.సీ.సీ మెంబెర్ గుండుపల్లి సతీష్ కుమార్ ప్రతిపాదన

అనకాపల్లి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పడిన నైపద్యంలో అనకాపల్లి రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా తీర్చిదిద్దాలని సౌత్ సెంట్రల్ రైల్వే 74వ జోనల్ రైల్వే యూజర్స్ కమిటీ మీటింగ్ లో జెడ్.ఆర్.యూ.సీ.సీ మెంబెర్ గుండుపల్లి సతీష్ కుమార్ జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కోరారు.ఈ సందర్బంగా ఖమ్మం ఎం.పి నామా నాగేశ్వరావు తో కలిసి గుండుపల్లి సతీష్ కుమార్ మీటింగ్ లో పాల్గొన్నారు.అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ మారడంతో పాటు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధిని చేయాలని కోరారు.అంతే కాకుండా ప్రతి రోజు సికింద్రాబాద్,తిరుపతికి అనకాపల్లి,విశాఖపట్నం నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు రైలులో ప్రయాణం చేస్తున్నారని,ప్రత్యేకించి మధ్యతరగతి కుటుంబాలకు అనుగుణంగా గోదావరి,తిరుమల ఎక్సప్రెస్ కు రెండు అదనపు జనరల్ బోగిలు కేటాయించాలని ఈ సందర్బంగా కోరారు.ప్రయాణికులకు నీడనిచ్చే షెడ్స్ ఏర్పాటు చేయాలని,మొదటి తరగతి , సాధారణ తరగతి ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని, ప్లాట్ ఫారంలపై ట్రైన్ కోచ్ల డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని,ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని రిఫ్రెష్మెంట్ గదులు మరియు మరుగుదొడ్లు శుభ్రపరిచే విధంగా తగిన సిబ్బందిని పెంచాలని కోరారు. ద్విచక్ర,నాలుగు చక్రాల వాహనాలకు తగిన పార్కింగ్ ఏర్పాట్ను చేయాలని,స్టేషన్ ఆవరణ ప్రాంతంలో మొక్కలు నాటాలని ఎక్కువ మరియు వికలాంగులకు ఏర్పాటు వృద్ధులు చేసిన ఎస్కలేటర్ ను ఆపరేటింగ్ చేసేందుకు తగిన సిబ్బందిని జిల్లాగా నియమించాలని,కొత్త | ఏర్పడిన ప్రతినిధులు అనకాపల్లి స్టేషన్ ప్రాంతాలకు ప్రయాణం చేయవలసిన నేపథ్యంలో కొన్ని ట్రైన్లు కోరమండల్ ఎక్స్ప్రెస్,యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ముంబై ఎల్టిటి ఎక్స్ ప్రెస్ లను అనకాపల్లి స్టేషన్ లో నిలపాలని మరియు ట్రయల్ రన్ బేసిస్ పద్ధతిలో రత్నాచల్ ట్రైన్ ను యలమంచిలి స్ట్రేషన్ నందు నిలపాలని కోరారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ నందు టవర్ క్లాక్ ను ఏర్పాటు చేయాలని సతీష్ కుమార్ కోరారు.వీటిపై సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular