అడవిలో ఒక లేడి వుండేది .అడవి అంతా గంతులు వేస్తూ స్వేచ్ఛగా పరుగులు పెట్టేది. తను అందంగా ఉన్నాను అని పొగరు. ఒక రోజు అలా అలా గంతులు వేస్తూ. ఒక రోజు అలా విహరిస్తూ ఒక గుబురు చెట్ల మధ్యన ఒక నెమలి పురివిప్పి నాట్యం బహు అద్బుతంగా చేస్తోంది.ఇంతవరకు ఈ పక్షి ఒకటి ఇంత సుందరంగా తెలియదే ! ఆహా ఏమి ఆ రూపం ఎంత అందం, ఆ నృత్యం అద్భుతం. నా అందం ఈ పక్షి ముందు ఎంత?నా పిచ్చి గంతులు నేను ఉత్త వెర్రిదాన్ని.అది చూసి ఈర్ష్య కలిగింది.ఈ అడవిలో నేనే అందగత్తెగా వెలిగిపోవాలని ఈ పక్షిని అడవి నుండి తరిమేయాలి. ఎలా ఆ రాత్రి నిదుర పట్టలేదు. కాని జింక రాకడ దాని ఈర్ష్య ఆ నెమలి గ్రహించింది. దానికి తనపై ఎంత పగ ద్వేషం పెంచుకుందో అర్థం అర్ధం చేసుకుంది.
తూర్పు తెలతెల వారుతుండగా నెమలి మహా అద్భుతంగా తన అందమంత ఆరబోసుకుని నర్తిస్తోంది. జింక కోడి నిద్ర లేచింది. నెమలిని ఎలా తరిమేయాలి అని గుండెల నిండా రగులుతోంది.ఎక్కడ ఉందో చూద్దాం అని నది ఒడ్డున నర్తిస్తున్న నెమలిని చూస్తే,,,,,!సూర్యుని లేలే లేత కిరణాల్లో ద్విగుణీకృత అందంగా ఉంది.ఏమి ఆ సౌందర్యం నేను వేష్టు అనుకుంటోంది. నృత్యం చేస్తూనే నెమలి జింక భావాలను గ్రహించి నాట్యం ఆపింది.
జింక గారు రండి మనమిద్దరం అలా వెళదాం రండి. అనగానే జింక ఈర్ష్య ద్వేషాలు గుండెలు పొగలు సెగలు అవుతూనే నెమలి వెంట వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళగానే ఎత్తైన కొండలపై నుండి దూకుతున్న జలపాతం దివి నుండి భువికి శివుని తలపై నుంచి గంగ ,దేవతలు దిగివస్తున్నారా అన్న చందముగా కళ్ళు కోటియైనా చాలవు అన్నట్లు ఉంది. జింక ఈర్ష్య ద్వేషాలు గాలిలో కలిసిపోయి. ఆ మలయమారుతాల్లో తేలియాడుతూ ఎంత సేపు అయ్యిందో పొద్దుగూకులు అక్కడే ఆ చల్లని నీటిలో జలకాలాడుతూనే ఉంది. జింక గారు మన ఇళ్లల్లోకి పోదాం పదండి చీకటి కమ్ముకొస్తోంది అని నెమలి నెమ్మదిగా అనగానే కనువిప్పు కలిగిన జింక ఇంటిదారి పట్టింది. తన మనస్సులో ఈర్ష అసూయలు ద్వేషాలు మటుమాయం అయ్యాయి.
అపరాజిత్
సూర్యాపేట
