ఈ జీవితం క్రుళ్ళిన సమాజానికి సందేశం ఇవ్వడానికే,ఏం సినిమాలు అబ్బాయి!?

పుష్పరాజులు,బాహుబలులు ఇంకా ఎన్నెన్నో,,,,,,!
భారీబడ్చేట్ ల సినిమాలు సరే
ఒక్క హీరో ఎన్ని వందల మందిని ఖతం
ప్రేక్షకులలో ఉద్రేకం రేపుతూ ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్లు
బూతుపాటలతో కోతి గెంతులతో సాక్షాత్తు హీరోయినే సగానికంటే ఎక్కువ బట్టలిప్పేసి రచ్చ రచ్చ వచ్చీరాని డిస్కోలు, కేబరె ఉపులు ఫుల్లుగా తాగిన మైకంలో యూత్
ఇది చూసిన ఈతరం జీన్ ప్యాంట్లు చొక్కాలు ఇదే ఫ్యాషన్ ఇప్పుడు,,,,,,,,
అమ్మాయిలు స్లీవ్ లెస్ జాకీట్లు అర్ధనగ్నంగా రోడ్లపై వెళుతుంటే,,,,,,
పల్లికిలించి మాట్లాడుతూ వుంటే గబ్బు వాసనలకు కక్కువస్తుంది
ఈ పబ్బుల్లో బార్లలో అర్ధరాత్రుళ్ళు తాగుళ్లు తిండి
ఇందులో ఆడ మగ తేడా లేదు,,,,,
ఎన్నిరోజులకు కూలిపడుతుందో ఈ వ్యవస్థ
సెల్ ఫోన్ల నిండా బూతులు
గంటలకు గంటలు బోయ్స్ గర్ల్స్ బూతులు తాగుతూ టాకింగులు
ఫారిన్ కల్చరా ఇది కాదు మిడిమిడి జ్ఞానం
టీవీల్లో సీరియళ్లు ఇవే వీటన్నింటి కంటే నయం సొల్లు కార్చుతూ కథ సాగబీకినా బూతులు ఫైట్లు ఉండవు
చదువులు సట్టుబండలు
ఈ మానసిక రోగులకు చదువులు అబ్బుతాయా
జాతరలో పేక్ సర్టిఫికెట్ ల అమ్మకాలు ఇతర దేశాలలో చదువులంటూ
అక్కడ కరెన్సీ డిఫరెంట్ కదా వాళ్ళ పెట్రోల్ బంకుల్లో ఇతరత్రా వంగబడి వెట్టిచాకిరి చేస్తేనే తిండి
ఈ చండాలపు బ్రతుకులు దేనికి చావు నయం
సామాజిక రుగ్మతలు మార్చే సినిమాలు రావాలి మితిమీరిన బూతులను ఫైట్స్ పకడ్బందీగా సెన్సార్ చేయాలి, సెల్ ఫోన్లు సమాచారం చేరవెయ్యడానికే వీటికి కూడా సెన్సార్ ఉండాలి,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular