ఉమ్మడి జిల్లాలో ఇళ్ల పంపిణీ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన జిల్లా పట్టాల పంపిణీ , డబుల్ బెడ్ రూమ్ , గృహలక్ష్మి పథకంలో ఎంపీక చేసిన లబ్ధిదారుల అంశంలో అనేక అవక తవకలు జరిగాయని , నిజమైన అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని , వీటిపై అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ షేక్ నజీమా, కో కన్వీనర్ జి. నరేంద్ర డిమాండ్ చేశారు . బుధవారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కేంద్రమైన వైఎస్ఆర్ కాలనీ 8వ డివిజన్లో పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ పంపిణీ కార్యక్రమంలో మొత్తం ఎనిమిది మంది లబ్ధిదారులను తొలగించారని జరిగిన ఆందోళనలో ప్రభుత్వ చిత్తశుద్ధి , పారదర్శక ప్రశ్నార్థ కరంగా మారిందని విమర్శించారు . అదే విధంగా భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతంలో సైతం పి వి కే – 5 బొగ్గు గని ఓపెన్ కాస్ట్ విస్తరణలో ఇల్లు తొలగించిన లబ్ధిదారులకు మరోచోట ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం లో అనేక అవకతవకలు జరిగాయని మొత్తం 286 మంది నీ అర్హులుగా ఎంపిక చేస్తే అందులో 67 మంది తమను గుర్తించలేదని ఆందోళన తలపెట్టడం అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారుల వైఖరిని తేట తెల్లం చేస్తుందని ఆరోపించారు . ఇదే కాకుండా ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని రఘునాథ పాలెం మండలంలో గృహలక్ష్మి పథకం లో కూడా అర్హులు కాకుండా అనహర్లకే లబ్ధి చేకూర్చారనే విమర్శలు , ఆరోపణలు రావడం వెనుక అధికార పార్టీ నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు . ముఖ్యంగా రఘునాధపాలెం మండలంలోని పువ్వాడ ఉదయ నగర్ కాలనీలో గృహలక్ష్మి పథకం తో పాటు డబుల్ బెడ్రూం అంశం కూడా వివాదాస్పదంగా ఉందని విమర్శించారు . స్థానిక సర్పంచ్ ఇక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్న విషయం గమనించాలని కోరారు . డబుల్ బెడ్ రూంలు అధిక శాతం అన హరులకే కేటాయించారని , కొన్ని బెడ్రూం లు ఖాళీగా ఉంటే వాటిని సర్పంచ్ అద్దెకు ఇచ్చాడని , వినిపిస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ తలపెట్టాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో వీటిపై తమ ఐక్యవేదిక ఆందోళన కార్యక్రమాలు తలపెడుతుందని హెచ్చరించారు . ఈ సమావేశంలో ఐక్య వేదిక కోకన్వీనర్ లు బానోతు బద్రు నాయక్ నాయక్ , మట్టి ప్రసాద్ , వీరన్న నాయక్ , నాగేంద్ర నాయక్ , ఉపేంద్రభాయి , రవీంద్ర నాయక్ , శ్రీనివాస్ నాయక్ , జంగిపల్లి రవి తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular