హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.
వారానికో నిరుద్యోగి తల్లికి గర్భశోకాన్ని మిగిలిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా కేసీఆర్ మార్చారని విమర్శించారు.
గడీల పాలనకు అడ్డొస్తుందని కొత్త రాజ్యాంగం రాయాలనుకుంటున్నారన్నారుజనాలు అరిగోసల పాలవుతున్నా మీరు రోజుల తరబడి సంబరాలు చేసుకోవాలే. ఎవరేట్లపోయినా మీరు మాత్రం సల్లంగుండాలే?’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.