లోకేశ్వరం: కేసీఆర్ అంటే వ్యక్తి కాదు శక్తి అని నిర్మల్ జిల్లా లోకేశ్వరం టి.ఆర్.యస్ నాయకులు అన్నారు. గురువారం కేసీఆర్ జన్మదినం సందర్బంగా లోకేశ్వరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో కేక్ కట్ చేసి ప్రాథమిక పాఠశాల పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ……….
ఏడున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో అన్ని రంగాలలో ముందు ఉన్నామన్నారు. మూడు రోజుల పాటు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నారని అన్ని వర్గాలకు సహాయం అందుతోందన్నారు. తెలంగాణలో అభివృద్ధి చూసి వేరే రాష్ట్రాలలో అమలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణతో పాటు దేశ విదేశాలలో కేసీఆర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలను చూసి పక్క రాష్ట్రం వాళ్ళు ఈర్ష పడుతున్నారని అన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడి కోసం దేశంలో ప్రజలు ఎదురుచుస్తున్నారని లోకేశ్వరం టి.ఆర్.యస్ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యామ్ సుందర్, మాజీ కన్వీనర్ లక్ష్మణ్ రావు, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, సోషల్ మీడియా కన్వీనర్.బండి ప్రశాంత్, నాలం గంగయ్య, సుధాకర్, వెంకట్ రావు. సాగర్. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.