భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు, మూడు రోజుల ముందు నుంచే వేడుకలు పండుగలా నిర్వహిస్తున్న విషయం తెలిందే.
అన్నదానం, రక్తదానం, బట్టలు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పుట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మంత్రి పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే దోశ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ దోశలో ఇంకో స్పెషల్ కూడా ఉంది. బీట్‌రూట్‌తో తయారు చేసిన గులాబీ రంగు దోశలను చేయించి ఒక్కో దోశను కేవలం రూపాయికే స్థానికులకు అందజేశారు. దీంతో కొత్త రంగులో ఉన్న దోశలను తినేందుకు ప్రజల ఎగబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Attachments area