కొత్త లింగాలలో దళితుల రాస్తారోకో

కామేపల్లి: అర్హులైన నిరుపేదలందరికీ దళిత బంధు పథకంలో అవకాశం కల్పించాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్త లింగాలలో గురువారం ఖమ్మం-ఇల్లందు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

ఈ సందర్భంగా జడ్పీటీసీ వెంకట ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ………
కామేపల్లి మండలంలో దళితబంధు పథకానికి 16 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా వారంతా అధికారపార్టీ నాయకులేనని వారు ఆరోపించారు. దీంతోపాటు వారంతా ఆర్థికంగా బలపడిన వ్యక్తులే అన్నారు. జాబితాను రద్దు చేసి నిజమైన పేదవారిని అర్హులుగా ఎమ్మెల్యే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో వివిధ పార్టీల నాయకులు నర్సింహారెడ్డి, కృష్ణ, లక్ష్మీనారాయణ, శ్రీను యాదవ్‌, రాకేశ్‌, తదితరులు పాల్గొన్నారు. Attachments area

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular