చోరీసోత్తు, గంజాయితో పట్టుబడిన ఘజియాబాద్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

కేజీల్లో బంగారు, వజ్రాల అభరణాలు, డబ్బులు స్వాధీనం


బ్యూరో చీఫ్ వరంగల్ సెప్టెంబర్ 13

అపార్ట్మెంట్లలో తాళం వేసి వున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడటమే కాకుండా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల గల మజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సిసిఎ స్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వీరి నుండి రెండు కోట్లు విలువగల సూమారు 2కిలో 380 గ్రాముల బం గారు, వజ్రాల అభరణాలు, ఐదు లక్షల 20 వేల రూపా యల విలువ గల 14 గంజాయితో పాటు ఒక పిస్టల్ ఐదు రౌండ్లు, కారు, నాలుగు సెల్ఫోన్లు, రెండు వాకీటా కీలు, నాలుగు నకిలీ అధార్కార్డులు, ఐదువేల రూపా యల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్బర్ ఖురేషి, తండ్రిపేరు హక్మిస్, వయస్సు 34 ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కపిల్ జాటోవు తండ్రిపేరు భరత్ వీర్, వయస్సు 30, మీరట్ జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహమ్మద్ షరీఫ్, తండ్రి పేరు షబ్బీర్, వయస్సు 56, ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, యం.డి జాద్ ఖాన్, తండ్రి పేరు మహమ్మద్ షరీఫ్ వయస్సు 25, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ రా ష్ట్రంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారుఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడిస్తూ ఈ నెల ఐదవ తేదిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మట్టేవాడ, హనుమకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో అ పార్ట్మెంట్లల్లో తాళం వేసిన వున్న ఎనిమిది ఇండ్లను లక్ష్యంగా చేసుకొని పెద్ద మొత్తంలో బంగారు, వెండి అభరణాలతో పాటు నగదు చోరీలు జరిగాయి. ఈ చోరీలపై అప్రమత్తమైన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశాల మే రకు ఈ చోరీలకు పాల్పడిన దొంగలను పట్టుకోనేందు కుగాను డిసిపి క్రైమ్స్ దాసరి మురళీధర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ చోరీలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృం దాలు వరంగల్లో వరుస చోరీలు జరిగిన ముందు రోజు న అదిలాబాద్, మరుసటి రోజు బెంగూళూర్లో ఇదే త రహా చోరీలు జరిగినట్లుగా గుర్తించారు. దీనితో వరంగ ల్ పోలీస్ కమిషనరేట్, ఆదిలాబాద్, బెంగుళూర్లో చో రీలు జరిగిన ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుల కదలికలకు సంబందించి సిసి దృష్యాలతో పాటు నిం దితులు వినియోగించిన కారును ఫోటోలను సేకరిం చారు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఇదే తరహలో చోరీలు ఏ ఏ రాష్ట్రాల్లో జరిగినట్లు విచారించిన పోలీ సులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కేంద్రం ఇదే తరహాలో గత మే నెల చోరీలు జరగగా, ఈ చోరీలకు పాల్పడిన నిందితులను కర్నూలు పోలీసులు అరెస్టు చేసి జైలు పంపినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ కావడంతో నిందితులను అరెస్టు చేసిన కర్నూలు నాల్గ వ పట్టణ ఇన్స్స్పెక్టర్ శంకరయ్యతో పాటు స్టేషన సి బ్బందిని సహకారాన్ని తీసుకోవడంతో పాటు వారిని సైతం ప్రత్యేక దర్యాప్తు బృందంలో నియమించడం జ రిగింది. దర్యాప్తును వేగం పెంచిన వరంగల్ కమిషనరే ట్ పోలీసులు వివిధ రాష్ట్రాలోని టోల్ ప్లాజాలు, సిసి కెమెరాల దృష్యాల అధారంగా పోలీసులు తమ వద్ద అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితులను పట్టుకోనేందుకు వేట కోనసాగించారు.

ఇందులో భాగం ఈ రోజు ఉదయం సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ జంక్షన్ వద్ద వాహన తనీ ఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా వస్తున్న వెర్నా కారును ఆపి తనీఖీ చేసే క్రమంలో కారులోని అనుమానితులు తప్పించుకోనేందుకు ప్రయత్నిస్తుం డగా పోలీసులు అనుమానితులను అదుపులోకి తీ సుకొని విచారణ చెపట్టారు. ఈ విచారణలో పోలీ సులు అరెస్టు చేసిన నిందితులు నలుగురు ఉత్తర ప్ర దేశ్ రాష్ట్రం, ఘజియాబాద్, మీరట్ జిల్లాలకు చెందిన వారు. వీరందరు చెడు వ్యసనాలకు అలవాటు పడి, వీరి జల్సాలకు అవసరమైన డబ్బును సులభంగా సం పాదించాలనే అలోచనతో నిందితులు ఒక ముఠా ఏర్ప డి ఆపార్ట్మెంట్లల్లో తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలు చేసి పలుమార్లు పోలీసులకు సైతం చిక్కి జైలు జీవితం గడిపారు.

జైలు నుండి విడుదలైన ఈ ముఠా సభ్యులు మరో చోరీలకు సిద్ధపడ్డారు. ఇం దులో ఈ ముఠా ఈ సంవత్సరం మే మాసంలో ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన సం ఘటనలో ఈ ముఠాను కర్నూలు పోలీసులు జూన్ మాసంలో అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుండి విడుదలైన నిందితుల్లో ఎలాంటి మార్పులు రాకపోగా మరోమారు ఈ ముఠా సభ్యులు చోరీలు చేసేందుకు సిద్ధపడ్డారు. ఇందుకోసం వీరు చోరీ అనం తరం సంఘటన స్థలం నుండి సులభంగా తప్పించు కోనేందుకుగాను ఒక కారును కొనుగోలు చేసారు. ఈ నెల మూడవ తేదీన ఈ ముఠా సభ్యులు కారులో ఢిల్లీ నుండి బయలుదేరి 4వ తేదిన ఆదిలాబాద్ జిల్లా పట్ట ణ కేంద్రంలో రెండు అపార్ట్మెంట్లల్లో తాళం వేసివున్న ఇండ్లల్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి అభర ణాలతో పాటు డబ్బు చోరీ చేసారు. అక్కడితో అగ కుండా ఈ అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు కారులో ఈ నెల ఐదవ తారీఖున వరంగల్ నగరానికి చేరుకోని మ ట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, సుబేదారి పోలీస్ స్టే షన్ పరిధిలో రెండు చోరీలకు పాల్పడ్డారు. నిందితులు చోరీకి పాల్పడే క్రమంలో మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరి ధిలోని వద్దిరాజు అపార్ట్మెంట్లోనికి వెళ్ళుతున్న క్రమం లో నిందితులను అపార్ట్మెంట్ వాచ్మెన్ అడ్డగించి ప్రశ్నిం చడంతో నిందితులు వాచ్మెన న్ను పిస్తోల్తో బెదిరిం పు లకు పాల్పడ్డారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో చోరీలకు పాల్పడిన అనంతరం ఈ ముఠా సభ్యు లు కారులో బెంగుళూరు పట్టణంలో నాలుగు చోరీలకు పాల్పడి మరోమారు హైదరాబాద్ చేరుకున్న నిందితు లు రహస్యంగా చోరీ చేసిన డబ్బుతో జల్సాలు చేసా రు. అక్కడితో అగకుండా ఈ ముఠా తమ వద్ద వున్న డబ్బుతో గంజాయి తక్కువ ధరకు గంజాయి కొను గోలు చేసి ఢిల్లీ ఎక్కువ ధరకు విక్రయించడం మరింత పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించాలనే అలోచనతో ఈ ముఠా సభ్యులు ములుగు ప్రాంతంలో 104 కిలోల గంజాయిని కొనుగోలు చేసారు. నిందితులు చోరీ చే సిన బంగారు అభరణాలు, గంజాయితో తిరిగి ఢిల్లీకి వెళ్ళే క్రమంలో సుబేదారి పొలీసులకు చిక్కారు. ఈ ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర ముఠా ఇప్పటి వరకు మొత్తం 16 చోరీలకు పాల్పడనగా రెండు తెలుగు రా ష్ట్రాల్లో పదిచోరీలకు పాల్పడగా, గతంలోను ఈ ముఠా 30 చోరీలకు పాల్పడ్డారు.ఈ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడం చాకిచక్యంతో పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ డిసిపి దాసరి మురళీధర్, క్రైమ్స్ ఎసిపి మల్లయ్య, మట్టేవాడ, మహిళ పోలీస్ స్టేషన్ -1, సిసిఎస్, హనుమకొండ, సుబేదారి ఇ న్స్స్పె క్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యప్రసాద్, శంకర్ నాయక్, కరు ణాకర్, షూకూర్, కర్నూల్ జిల్లా నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్స్పెక్టర్ శంకరయ్య, ఏఏఓ సల్మాన్పషా, ఎస్.ఐలు విఠల్, కిషోర్, అనిల్, సంపత్కుమార్, రాజేందర్, బాబురావు, యాదగిరి, ఏ.ఎస్.ఐ తిరుప తి, గోపాలరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, రవి, మున్నా, రోషన్ ఆలీ, కర్నూలు జిల్లా కానిస్టేబుల్లు నా గరాజు, శ్రీనివాసులు, వరంగల్ కమిషనరేట్ కాని స్టేబుళ్ళు ఆలీ, మధు, వంశీ, విశ్వేశ్వర్, శివ, గౌస్పషా, కర్నూల్ జిల్లా నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్స్పెక్టర్ శంకరయ్య, సదానందంలను వరంగల్ పోలీస్ కమి షనర్ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular