తెలుగు ఫిలిం ఛాంబర్స్‌ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్‌ భారీ విజయం


హైదరాబాద్, ప్రతినిధి జులై 30
:- ఫిలింనగర్ ఛాంబర్ లో ఈరోజ రసవత్తరంగా హోరాహోరీ ఎన్నికలు జరిగాయి ఎన్నికలలో దిల్ రాజు వర్గీయులు విజయం సాధించారు,

నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్‌ నుంచి 12 మందిలో ఏడుగురు గెలుపొందారు

దిల్‌రాజు, దామోదర ప్రసాద్‌, మోహన్‌ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్‌, పద్మిని, రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌గౌడ్‌లు నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్‌ నుంచి గెలిచారు.

డిస్ట్రిబ్యూషన్‌ విభాగంలో​ ఇరు ప్యానెల్‌ నుంచి సమానంగా ఆరుగురి చొప్పున గెలుపొందారు.

స్టూడియో సెక్టార్‌లో నలుగురికి గాను దిల్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ముగ్గురు గెలుపొందారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో దిల్ రాజ్ ప్యానల్ లీడింగ్ లో ఉంది. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్ కు 563 ఓట్లు వచ్చాయి. సి.కల్యాణ్ ప్యానెల్ కు 497 ఓట్లు వచ్చాయి.

మొదట స్టూడియో సెక్టార్ ఓట్లు లెక్కింపు అయిన తరువాత డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఫైనల్‌గా ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు ఉంటుంది.

ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్‌ 3:30 నిమిషాలకు ముగిసింది. మొత్తం 1339 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 891,స్టూడియో సెక్టార్ నుంచి 68,డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 380 ఓట్లు నమోదయ్యాయి. ఈసారి రికార్టు స్థాయిలో పోలింగ్‌ జరిగింది. నాలుగు గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమై.. 6 గంటలకు ఫలితాలను ప్రకటించారు.

ఫిల్మ్‌ చాంబర్‌ ఎన్నికలు జనరల్‌ ఎన్నికల్లా జరుగుతున్నాయని, ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నటుడు ఆర్‌. నారాయణమూర్తి కోరారు. ఆదివారం ఫిల్మ్‌ చాంబర్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పాల్గొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

సినీ ప్రముఖులు సురేశ్‌ బాబు, ఆదిశేషగిరిరావు, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్‌ రెడ్డి, జీవిత తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటంన్నింటిని పరిష్కరించే సామర్థ్యం ఎవరికి ఉందో ఆలోచించి ఓటు​ వేయాలని నటి, దర్శకురాలు జీవిత విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ టైమ్‌లో ఫిల్మ్‌ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్‌ చూసిందని, అలాంటి విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తాను దిల్‌ రాజు వర్గానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular