నల్లబెల్లి ఎస్సైకి కఠిన సేవాపతకాన్ని అందించిన సిపి

హనుమకొండ: వరంగల్‌ కమి షనరేట్‌ కార్యాల యంలో సోమవారం నిర్వహించిన రివార్డు మేళాలో వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధి నల్లబెల్లి పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ రాజారాంకు సీపీ తరుణ్‌జోషి చేతులమీదుగా కఠిన సేవాపతకాన్ని అందించారు.

విధి నిర్వాహణలో రాణించే పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన సేవాపతకాన్ని ప్రకటిస్తోంది. ఈ క్రమంలో నల్లబెల్లి ఎస్‌ఐ నార్లపురం రాజారాంకు 2021 సంవత్సరానికి కఠిన సేవాపతకాన్ని ప్రకటించింది. గత కొద్ది రోజుల క్రితం మం జూరైన పతకాన్ని సీపీ స్వయంగా ఎస్‌ఐకి అందించారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట ప్రాంతానికి చెందిన రాజారాం 2012 సంవత్సరంలో రిజర్డ్వ్‌ ఎస్‌ఐగా పోలీసు శాఖలో చేరాడు. ఎనిమిది సంవత్సరాల పాటు వివిధ జిల్లాల్లో సమర్థవంతంగా పని చేసి 2020లో కన్వర్షన్‌పై సివిల్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 

AUTHOR:: Mahesh Babu Bodula, Mobile No: 9676868212, Nalgonda District

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular