నేడు మేడారం జాతరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్

తెలంగాణ మహా కుంభమేళ మేడారం జాతర ఈ నెల 16న అట్టహాసంగా ప్రారంభం అయింది. ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం జాతర ఈ నెల 16 నుంచి 19 వరకు జరగనుంది.

ఇప్పటికు సమ్మక్క – సారక్క అమ్మవార్లు గద్దె పై ప్రతిష్టించారు. దీంతో నేటి నుంచి భక్తులు ఎక్కువ మొత్తం మేడారంకు వెళ్తారు. నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారం జాతరకు వెళ్లనున్నారు.

గద్దెలపై కొలువు దీరిన సమ్మక్క –సారక్కలను దర్శించుకోనున్నారు. అలాగే తమ మొక్కులను కూడా తీర్చుకోనున్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బండి సంజయ్ తో పాటు పలువురు నాయకులు మేడారం జాతరకు వెళ్లనున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మేడారం జాతరకు వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రులు ఏర్పాట్లు చేశారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular