ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రూనే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్

న్యూఢిల్లీ: పంజాబ్‌ ఎ‍న్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వీడియా సందేశంలో ప్రజలను కాంగ్రెస్‌కి ఓటు వేయాలని కోరారు.
ప్రతి సమస్యకు తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని నరేంద్రమోదీ పై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందంటూ ఆక్రోసించారు. అంతేకాదు ఆ వీడియోలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నడూ దేశాన్ని విభజించలేదని మోదీకి కౌంటరిచ్చారు.

దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యతో ప్రజలు సతమతమవుతుంటే గత ఏడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న ప్రస్తుతం ప్రభుత్వం తమ తప్పులన ఒప్పుకోకుండా ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రూనే కారణమంటూ ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు మీరు మీ స్వంత లోపాలను తగ్గించే క్రమంలో చరిత్రను నిందించలేరంటూ వక్కాణించారు. ప్రపంచం ముందు దేశ ప్రతిష్టను పోగొట్టుకోనివ్వను, అలాగే భారతదేశ గర్వాన్ని నేనెప్పుడూ కించపరచలేదంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తనపై తప్పడు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆ పార్టీకి సంబంధించిన బీ అండ్‌ సీ టీమ్‌లు గురించి దేశం ముందు బహిర్గతం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular