ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి

పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మృతి దురదృష్టకరం అని అన్నారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. వారితో ఉన్న సాన్నిహిత్యం మంత్రి గుర్తు చేసుకున్నారు. ములుగు జిల్లాలో చురుకైన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్ గా ప్రజలకు సేవలు అందిచారని మంత్రి కొనియాడారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న నాయకుడి మృతి బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాని అన్నారు. వారి కుటుంబసభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ రోజు ఉదయం జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తన నివాసంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో చికిత్స నిమిత్తం వరంగల్ జాహారా ఆసుపత్రిలో చేర్పించారు. కొద్దిసేపటికే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular