ఎంపికైన విద్యార్థులు ఉదయ్, భరత రాజ్.
అలంపూర్ 4 ఆగస్టు 2023 తెలంగాణసాక్షి ప్రతినిధి:- పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు అథ్లెటిక్స్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. జూలై 31 జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో 100 మీటర్ల పరువు పందెంలో పదవ తరగతి విద్యార్థి ఉదయ్ ప్రథమ స్థానంలో, భరత రాజ్ ద్వితీయ స్థానంలో ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు శివ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థులు వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆగస్టు 7న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. నాగలక్ష్మి, పాఠశాల కరస్పాండెంట్ కే ఎన్ వి రవి ప్రకాస్ విద్యార్థులను వారిని ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.