వికారాబాద్ జిల్లా కోస్గిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కాంగ్రెస్, టీఆర్ ఎస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు.
సీఎం కేసీఆర్ ను హేళన చేసేలా కేక్ కటింగ్ చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. అయితే వారి కేక్ కటింగ్ ను ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పరస్పరం రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.