విశాఖపట్నం పర్యటనలో తన కాన్వాయ్‌ ఆపి ప్రజల సమస్యలు విన్న సీ.ఎం. వై.య‌స్. జగన్మోహన్ రెడ్డి..

శ్రీకాకుళం /సీ.ఎం.ని కలిసి తమ బిడ్డల అనారోగ్య సమస్య వివరించి శస్త్రచికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరిన శ్రీకాకుళం జిల్లా డీఆర్‌ వలస గ్రామానికి చెందిన కూలీలు పాండ్రంకి రామారావు, సుబ్బలక్ష్మి. తమ కుమారులిద్దరూ సికిల్‌బెడ్‌ థలసేమియాతో భాదపడుతున్నారని, వారి శస్త్రచికిత్సకు ప్రభుత్వం సాయం అందించాలంటూ ముఖ్యమంత్రికి విన్నవించుకున్న రామారావు దంపతులు.

పిల్లల ఆరోగ్యపరిస్ధితి చూసి చలించిన సీ.ఎం. వై.య‌స్‌. జగన్మోహన్ రెడ్డి వారికి అవసరమైన సాయం చేయాల్సిందిగా విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు.

సీ.ఎం.ను కలిసి తన సమస్య చెప్పుకున్న పెదవాల్తేరుకు చెందిన ధర్మాల త్రివేణి, కొద్దిరోజుల క్రితం తన భర్త హత్యకు గురయ్యాడని, ఇద్దరు చిన్న పిల్లలతో తన కుటుంబ పోషణ భారంగా మారిందని సీ.ఎం.కి వివరించిన త్రివేణి. త్రివేణి కుటుంబానికి తగిన న్యాయం చేయమని విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular