గుంటూరు: హోం మంత్రి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా వైఎస్ షర్మిల పార్టీ పెట్టకూడదా అని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు.
తెలంగాణలో పార్టీ పెడితే రాష్ట్రానికి రాకుండా తరిమేశామంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళ సొంతంగా పార్టీ పెట్టుకుంటే తప్పుగా ఎందుకు కనపడుతుందని ఆమె నిలదీశారు. టీడీపీ పాలనలో మహిళా సాధికారత సాధించినట్లైతే ఎందుకు 23 స్థానాలకే పరిమితమయ్యారని ఆమె ప్రశ్నించారు.