కమ్యూనిస్టుల ఐక్యతే ఎం సిపిఐయు లక్ష్యం

కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న.
భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎం సిపిఐ యూ జాతీయ కన్వెన్షన్ సదస్సు ఈనెల 23 .24 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ మహానగరంలో కామ్రేడ్ .గాదగోని రవి. తెలంగాణ. ఎం వి రెడ్డి. ఆంధ్రప్రదేశ్. ప్రేమ్ సింగ్. పంజాబ్. గోపి కిషన్. .రాజస్తాన్. అధ్యక్షతన జరిగింది.
సదస్సుకు ముందు ఎం సిపిఐ యూజాతీయ పతాకాన్ని గోపి కిషన్ ఆవిష్కరించగా సదస్సుకు 12 రాష్ట్రాలను 280 మంది పార్టీ పోలిటి బ్యూరో. కేంద్ర కమిటీ . రాష్ట్ర కమిటీల సభ్యులు ప్రతినిధులు హాజరైనారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ వారసుడు. కామ్రేడ్ అశోక్ ఓంకార్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
12 రాష్ట్రాల నుండి జాతీయ కమిటీని 78 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ రైతాంగ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన అమర జీవులు .కామ్రేడ్ బి.ఎన్.రెడ్డి ఓంకార్ వారసుడు సూర్యాపేట జిల్లా నుండి వరికుప్పల వెంకన్న
ఎన్నిక పట్ల పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్. జిల్లా నాయకత్వం. ప్రజాసంఘాల నాయకులు. బచ్చుకోటయ్య ఉగ్రయ్య .నలుగురి రమేష్. ఉమేష్. నరసయ్య. శీను హర్షం వ్యక్తం చేశారు.
వెంకన్న మాట్లాడుతూ కమ్యూనిస్టులు ఐక్యత కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీని ప్రజాసంఘాలను బలోపేతం చేయడానికి కృషి కృషి చేస్తానని వెంకన్న అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular