హుజూర్నగర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

  • డ్రైవర్ వృత్తి కష్టతరమైన పని.
  • రోడ్డు ప్రమాదాల నివారణకై డ్రైవర్లు డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి.
  • ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరాలనేది *అరైవ్ అలైవ్ ఉద్దేశ్యం.
  • పోలీస్ సామాజిక సేవగా డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షల శిబిరం.
  • కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న 500 లకు పైగా వివిధ వాహనాల డ్రైవర్లు.
  • పరీక్షల అనంతరం అవసరమైన వారికి మందులు, కంటి అద్దాల ఉచిత పంపిణీ.
  • రైవ్ అలైవ్ భద్రత మహా ఉద్యమం నిరంతరంగా కొనసాగుతుంది.

కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

రోడ్డు ప్రమాదాల నివారణ, గమ్యం చేరడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పోలీసు డిజిపి గారు ప్రారంభించిన ‘ఆరవ్ అలైవ్’ మహా ఉద్యమం కార్యక్రమం 2వ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా హుజూర్నగర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో హుజూర్నగర్ పట్టణ హాల్ నందు ఏర్పాటుచేసిన వివిధ రకాల వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని బుధవారం రోజున జిల్లా ఎస్పి నరసింహ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రైవర్ వృత్తి చాలా కష్టతరమైన పనిని ఈ వృత్తిని ఎంచుకొని నిర్విరామంగా కష్టపడుతూ డ్రైవర్లు ఆరోగ్యాలను లెక్క చేయలేకపోతున్నారని ఎస్పి అన్నారు, డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని డ్రైవర్ యొక్క కంటి చూపు బాగా ఉంటే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని తెలిపారు. డ్రైవర్లకు వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం జరుగుతుంది అలాంటి వారు కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకొని తగిన జాగ్రత్తలు పాటించాలి, కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని అన్నారు. చాలామంది డ్రైవర్లు కంటి చూపులు అశ్రద్ధ చేస్తున్నారని ఉద్దేశంతో రాష్ట్ర డిజిపి ఇచ్చిన పిలుపు మేరకు ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హుజూర్నగర్ పట్టణంలో సర్కిల్ పోలీసుల అధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిభిరం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, లైన్స్ క్లబ్ డాక్టర్లు, స్థానిక కంటి ఆసుపత్రుల డాక్టర్ల సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున కంటి పరీక్షలు నిర్వహించాం అని తెలిపారు.

రోడ్డు భద్రత అంటే రోడ్డు పై ప్రయాణించే వాహనదారులు వాహనాలను జాగ్రత్తగా నడిపి ప్రమాదాలను నివారించడం. రోడ్డు భద్రత రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకము, ప్రతి వహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి, రోడ్డుపై ఎడమ వైపున వాహనాన్ని నడపాలి, ఎక్కడపడితే అక్కడ అవహనాలు నిలపవద్దు, తప్పుడు మార్గంలో వాహనాలు నదిప్తే ప్రమాదాలు సంభవిస్తాయి అన్నారు. డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలి అంటూ. వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రహదారి సూచనలను పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, కారులో సీట్ బెల్ట్ మరియు ద్విచక్ర వాహనంపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగించరాదని, అలసట లేదా నిద్రలేమి ఉన్నప్పుడు వాహనం నడపవద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి పత్రాలు కలిగి ఉండాలి, బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న జాగ్రత్త ప్రాణాలను కాపాడగలదని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ శిబిరం ద్వారా 500 వందలకు పైగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, CI చరమంద రాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, స్థానిక ఎస్ఐ మోహన్ బాబు, గరిడేపల్లి ఎస్సై నరేష్, పాలకవీడు ఎస్ఐ కోటేష్, హుజూర్నగర్ ఏరియా హాస్పటల్ సూపరింటెండెంట్ డా.ప్రవీణ్ కుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ జిలానీ, డాక్టర్లు నాగేందర్, స్థానిక కంటి అస్పటల్ డాక్టర్ ప్రవళిక, లైయన్స్ క్లబ్ డాక్టర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.

Telangana Sakshi
Telangana Sakshihttp://telanganasakshi.com
Gireesh Kumar is an Senior Telugu Journalist, Political analyst. He formerly served as editor of Telangana Sakshi, a Telugu Daily Newspaper and Web News. He is known for his commentary on Telangana Politics, and for hosting political talk shows.[
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular