సూర్యాపేట: జిల్లా కేంద్రంలో సోమవారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా పుట్టినరోజు వేడుకలు విద్యానగర్ లో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెద్దిరెడ్డి రాజా మరింత ఉన్నతమైన పదవులు పొందాలని, భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కల్పించాలని ఆకాంక్షించారు.
అలాగే ఆయన సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని కోరుతూ పలువురు నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్స్ డాక్టర్ ఊర రామ్మూర్తి, నాగుల వాసు, జ్యోతి కరుణాకర్, గండూరి రమేష్, సర్పంచ్ భూక్య రాజా నాయక్, నాయకులు నేరెళ్ల మధు, సుధా బ్యాంక్ ఎండి, పెద్దిరెడ్డి గణేష్, కక్కిరేణి చంద్రశేఖర్, నాయకులు బైరబోయిన శ్రీనివాస్, గోదల రంగారెడ్డి,నిమ్మల వెంకన్న, యామ ప్రభాకర్ (సుమన్ మెడికల్ షాప్), రాచకొండ శ్రీనివాస్, తోట శ్యామ్, గుడిపూడి వెంకటేశ్వరరావు, కొండగడుపుల సూరయ్య, మాచర్ల కృష్ణ,పలువురు నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

