మహిళలకు అండగా కాంగ్రెస్ పార్టీ…..

  • కుచినెర్ల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా…
  • తిరగబడదాం తరిమికోడదాం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణలో…..
  • కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…

గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండల పరిధిలోని కుచినెర్ల గ్రామంలో తిరగబడదాం తరిమికోడదాం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ హాజరై,గ్రామంలోని పురవీధులలో తిరుగుతూ బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలు చేసిన అక్రమాలను ప్రజలకు తెలియజేశారు…. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ చేతులమీదుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు..

ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ తెలంగాణ మహిళ తల్లులకు అండగా ఉండేందుకు, వారికి భరోసానిచ్చేందుకు, మహిళా తల్లులను లక్షాధికారి (మహాలక్ష్మీ)ని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన గొప్ప పథకం మహాలక్ష్మీ పథకం కింద .మహిళా తల్లులకు ప్రతినెల 2500 రూపాయల నగదు అందజేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,కర్ణాటక ఎన్నికల్లో మహిళా తల్లులకు ప్రతినెల 2000 నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చాం…ఇచ్చిన హామీ మేరకు 1 కోటి 10 లక్షల మంది మహిళా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నెలకు ₹2,000 జమ చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం,కర్ణాటకలో మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చి… అధికారంలోకి వచ్చిన వెనువెంటనే హామీని నెరవేర్చి మాట నిలుపుకున్నామని,తెలంగాణలోనూ వస్తున్నాం – ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు…

గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పోటీలో ఉంటున్న ప్రజలందరి ఆశీస్సులతో గెలిపించి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని కుచినెర్ల గ్రామా ప్రజలను సరితమ్మ కోరారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి,పాతపాలెం శ్రీనివాస్ గౌడ్,గట్టు కృష్ణమూర్తి,శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, సత్యనారాయణ,మహానంది రెడ్డి,నందిన్నె ఎంపిటీసి గీత,ఆంజనేయులు,సూరి,రామన్ గౌడ్, శేషాద్రి,విజయేంద్ర,గణేష్,కురువ గోవింద్,జంగిల్,ఆనంద్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, అల్వాల రాజశేఖరరెడ్డి, లక్ష్మణ్ ,జనార్థన్, జంబయ్య,అద్దల నరసింహ, యర్సన్ దొడ్డి గోవింద్, తిరుమల్,నరేష్, పాండు, గుంతాబాయి శ్రీను,సద్దనోముపల్లి ఆంజనేయులు,ఇమ్మానేయిల్, శ్రీనివాస్ యాదవ్, వెంకట్రాములు, ఎకే,వెంకటన్న, సురేష్, జమ్మిచేడు రాము, రవి,కంబయ్య,నరసింహులు.ఆంజనేయులు, తిమ్మప్ప,వీరన్న గౌడ్, జన గౌడ్ తదితరులు ఉన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular