సూర్యాపేట జిల్లా కేంద్రంలో రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక వంటకాల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో Arabian Mandi హోటల్లో రుచికరమైన హలీం, మరియు హరిస్, ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. మేకపోతు మాంసంతో సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్న ఈ హలీం, హరిస్ ,రుచులు ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ — రంజాన్ నెలలో మాత్రమే లభించే ఈ ప్రత్యేక వంటకాలను ప్రతి ఒక్కరూ రుచి చూడాలని, నాణ్యత మరియు రుచిలో ఎలాంటి రాజీ లేకుండా తయారు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇఫ్తార్ సమయాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ వంటకాలను ఆస్వాదిస్తున్నారని చెప్పారు.
అతి తక్కువ ధరల్లో అందిస్తున్న ఈ రంజాన్ స్పెషల్ వంటకాలను సూర్యాపేట ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి సంప్రదాయ రుచులను ఆస్వాదించాలని ఆహ్వానించారు.
రంజాన్ మాసపు ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ హలీం, హరిస్, వంటకాలు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
