భూదాన్ నిర్వాసితులను ఇండ్లలోకి పంపే వరకు పోరాటం చేస్తాం

తుమ్మల , శ్రీనివాస్ రెడ్డి , భట్టి పేదల పక్షమే అంటే మా పోరాటం లో భాగస్వామ్యం కావాలి.

బీసీ , ఎస్సీ , ఎస్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ విషాదారన్ మహరాజ్

ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూమిలో నిరాశ్రయులైన బాధితులను అంబేద్కర్ భవన్లో బీసీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజు పరామర్శించినారు .
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చబడిన ప్రదేశాన్ని సందర్శించి బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మీరు ధైర్యం గా ఉండాలని అన్నారు . బాధితులందరూ సంఘటితంగా ఉండి అన్ని పార్టీలతో ఉమ్మడి కార్యాచరణ కమిటీని వేసి నిర్వాసితులకు వెలుగుమట్లలోనే ఇల్లు కట్టించే వరకు న్యాయపరమైన ప్రజాస్వామ్య పోరాటం కొనసాగిస్తామని పోరాట కమిటీని అన్ని పార్టీల తో ఏర్పాటుచేసి పేదలకు ఇండ్లు కట్టించి వారినీ ఇండ్లలోకి పంపించేంతవరకు వెనకడుగు వేసేది లేదని బీసీ ఎస్సీ ఎస్ టి రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహరాజ తెలియజేశారు . అగ్రవర్ణ ఆధిపత్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు నిలవా నీడ లేకుండా చేసిన ప్రభుత్వం దోషిగా నిలబడిందని వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పొడకంటి రాంబాబు , ఖమ్మం జిల్లా కన్వీనర్ ములకలపల్లి సంగమేశ్వర రావు , కో కన్వీనర్లు జక్కుల రాజేష్ , కటకం వెంకటలక్ష్మి , వీర్నారీ మహిళ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఆర్ దేవి , ఆంటోనీ సురేష్ , కొర్లపాటి వీర రాఘవులు , నాగేశ్వరావు , నర్ల శేషయ్య ముదిరాజ్ , రావుల హనుమంతరావు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు .

Telangana Sakshi
Telangana Sakshihttp://telanganasakshi.com
Gireesh Kumar is an Senior Telugu Journalist, Political analyst. He formerly served as editor of Telangana Sakshi, a Telugu Daily Newspaper and Web News. He is known for his commentary on Telangana Politics, and for hosting political talk shows.[
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular