– ఎస్.ఐ షాహీన
ఖమ్మం నగరంలోని సమర్థనం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.ఐ షాహీన పాల్గొని ప్రసంగించారు . మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలతో పోటీ పడాలని టెక్నికల్ స్కిల్స్ తో పాటు క్రమశిక్షణ ఆత్మస్థైర్యం కలిగి ఉండాలి అన్నారు . మహిళలు అభివృద్ది చెందినపుడే కుటుంబం సమాజం బాగుంటుందని చెడు మార్గంలో ప్రయాణిస్తే సమాజంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు .

ఎన్ని కష్టాలు ఎదురైనా విద్యను నిర్లక్ష్యం చేయవద్దని భవిష్యత్తులో విద్య ఒక్కటే మహిళలకు జీవనాధారం అవుతుందన్నారు . ఈ సందర్భంగా ఉచిత శిక్షణ కేంద్రం నిర్వాహకులను అభినందించారు . అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియచేశారు . ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్రం నిర్వాహకులు సీనియర్ అధ్యాపకులు కోడిరెక్క ఉమా శంకర్ , గోగుల చంద్రశేఖర్ , ట్రైనర్స్ అవులూరి సౌమ్య , కల్లేపు అఖిల , మెహరిన్ తదితరులు పాల్గొన్నారు .
