పోలీసు అధికారుల నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ

  • ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భద్రత అంశాలపై అవగాహన.
  • అక్రమ రవాణా, అసాంఘిక చర్యల పై పటిష్ట నిఘా.
  • ప్రజల భద్రత కోసమే నిత్యం తనిఖీ.

-…… కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా..

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి తో కలిసి జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సామాజిక రక్షణ, శాంతి భద్రతల అంశాలు, చట్టాల అమలు, సామాజిక భద్రతలో పౌరుల బాధ్యత, రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, మహిళల భద్రత, యువత భద్రత అంశాల పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల పై పటిష్ట నిఘా ఉంచి నివారించాలని ఆదేశించారు.

సమీక్ష లో భాగంగా నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, శిక్షలు అమలు, డయల్ 100 కాల్స్, బాధితుల ఇంటి వద్ద నుండి కేసు నమోదు, ప్రజా ఫిర్యాదుల పై స్పందన, వాహనాల తనిఖీ, అనుమానిత వ్యక్తుల కదలికలు, రౌడి షిటర్స్ పై నిఘా, రోడ్డు ప్రమాదాల నిర్మూలన, సైబర్ మోసాల్లో నగదు రిఫండ్, దొంగతనాల కేసుల్లో కేసుల డిటెక్షన్ మొదలగు అంశాలను సమీక్షించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. సైబర్ మోసాలపై, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలి అన్నారు. కేసులు పెండింగ్ లేకుండా దర్యాప్తు చేయాలి, వేగంగా పోలీసు సేవలు అందించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్నారు. పాత నెరస్తులపై నిఘా ఉంచాలి అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, అక్రమ రవాణా నివారణకు నిత్యం తనిఖీలు చేయాలి అని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట DSP ప్రసన్నకుమార్, DCRB ఇన్స్పెక్టర్ మాగ్దూమ్ అలి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, CI లు, SI లు, సిబ్బంది ఉన్నారు.

Telangana Sakshi
Telangana Sakshihttp://telanganasakshi.com
Gireesh Kumar is an Senior Telugu Journalist, Political analyst. He formerly served as editor of Telangana Sakshi, a Telugu Daily Newspaper and Web News. He is known for his commentary on Telangana Politics, and for hosting political talk shows.[
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular