సూర్యాపేట, తెలంగాణ సాక్షి కార్పోరేట్ సంస్థలు ప్రజల ముంగిటకే రావడం అభినంద నియమని కోదాడ శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ పద్మావతి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సౌత్ ఇండియా పెయింట్స్ షో రూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆమె మాట్లాడుతూ పోటీ ప్రపంచములో కార్పోరేట్ సంస్థలు మారు మూల ప్రాంతాలలో ఏర్పాటుచేసి ప్రజలకు చేరువ అవుతున్నాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గృహ నిర్మాణములను ఆకర్ష నియమైన రీతిలో నిర్మి0చుటకు సౌత్ ఇండియా కంపెనీ వివిధ కలర్స్ అందుబాటులోకి తీసుక రావడం శుభప్రదం అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, కౌన్సిలర్లు నాగుల వాసు, కొండపల్లి దిలీప్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, కమదాన ఫిరోజ్ కుమార్, మంజుల, వర్ష, నకుల్, డాక్టర్లు ఎన్ కార్తీక్ రావు, వినీషా, నాయకులు రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
