రష్యాతో చర్చలకు ఒకే చెప్పిన అమెరికా కానీ ఒక షరతు!

ఉక్రెయిన్- రష్యాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాతో సమావేశం కానుంది రష్యా. ఈ మేరకు చర్చలకోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ప్రతిపాదించిన తేదీలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ అంగీకారం తెలిపారు.రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది రష్యా. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ప్రతిపాదించిన తేదీలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ అంగీకరించారు. అయితే ఉక్రెయిన్​పై రష్యా దాడి చేయొద్దన్న షరతుతోనే అగ్రరాజ్యం ఈ చర్చలకు ఓకే చెప్పినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.
“ఉక్రెయిన్- రష్యా మధ్య ఏర్పడిన యుద్ధవాతావరణం నేపథ్యంలో రష్యా స్పందించింది. వచ్చే వారం అమెరికాతో చర్చలు జరిపేందుకు తేదీలను ప్రతిపాదించింది. వాటిని మేము అనుమతిస్తున్నాం. కానీ ఇకపై ఉక్రెయిన్​పై రష్యా దాడికి పాల్పడొద్దని షరతు విధించాం.”
అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్క ఓకవేళ రష్యా మాట తప్పి రానున్న రోజుల్లో ఉక్రెయిన్​పై దాడికి పాల్పడితే దౌత్య విధానాలను సీరియస్​గా తీసుకోనట్లుగా భావిస్తామని నెడ్ ప్రైస్ అభిప్రాయపడ్డారు. తమ భాగస్వామ్య దేశాలు, నాటో దేశాలతోనూ రష్యాతో సంప్రదింపులు జరిపిస్తామన్నారు.
చర్చలను స్వాగతించిన యూఎన్​ కౌన్సిల్..అమెరికా- రష్యాల మధ్య చర్చలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్వాగతించింది. ఉక్రెయిన్​పై రష్యా దాడి చేయొద్దని సూచించాయి.రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ యూఎన్​ఎస్​సీలో ప్రసంగించారు. దౌత్యపరమైన చర్యల ద్వారానే ఈ సంక్షోభాన్ని పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఉక్రెయిన్​పై రష్యా దాడి చేసేందుకు సిద్ధమైనట్లు అమెరికా, నాటో దేశాలు ఆరోపించాయి. దీనిపై రష్యా స్పందిస్తూ ఏ దేశంపైనా దాడి చేయాలని తాము అనుకోవడం లేదని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular