మానవ జీవన ప్రస్థానం,,,,,!!

కోతి నుండి మనిషిగా రూపుదిద్దుకోవడానికి
ఎన్నెన్ని జన్మలు అంతరించిపొయాయో
తన ఉనికి కోసం ప్రకృతితో సలిపిన పోరాటంలో
ఎన్నెన్ని క్రూరమృగాలను అంతమొనరించాడో
రెండు రాతియుగాలలో ఎన్నెన్ని
ఉరుములు పిడుగులు మెరుపుల జోరువానల్లో కుదేలయ్యాడో
ఎన్ని చాలిగాలుల్లో గజగజ వణికిపోతూ కారడవుల వృక్షాలపై తలదాచుకున్నాడో
ఎండల మంటల్లో రక్షణ కోసం ఎన్నెన్ని ఘాఢాంధకారాలు శోధనలు ఘోరాలు చవిచూశాడో
ఆ కారడవుల్లో ఎన్ని అలవికాని క్రూరమృగాలను జయించి అంతరించేలా పోరాడాడో
యుగయుగాల తన ప్రస్థానంలో ఎన్నేన్ని ఉషోదయాలు, సిరివెన్నెలలో ఊరడీల్లాడో
తన నోటితో మొదటగా అమ్మ అన్నమాట స్వరపేటిక నుండి రావడానికి ఎన్ని యుగాల ప్రకృతితో పోరాటాల హింసల ఫలితమో అమ్మ అన్న పదం తర్వాత మెదడు ఎన్నెన్ని రూపాంతరాలు చెంది ఆటవికుడి నుండి సున్నితమైన మాటల వెల్లువలు రూపుదిద్దుకోవడానికి
ఉప్పొంగే ప్రకృతి అందాలను వర్ణించేందుకు ఎన్ని కలల కళలు కాలగర్భంలో కలిసిపోయాయో
తాను అనుభవిస్తున్న వేదనలు హింసలు, ఆనందాల అందాల ప్రకృతి జలపాతాలు నదుల్లో జలకాలు పచ్చని కారడవుల సోయగాల్లో ఎన్నెన్ని జన్మల అనంతరం తన భయాలు సుఖదుఃఖాలలోతన మనస్సు అనుభూతులకు మూలం చెట్టుపుట్ట, రాయిరప్ప నుంచి వినీల గగనంలో ఎండల మంటల సూర్యుడు, కళలు మారే చల్లని వెన్నెలల చంద్రుడుఅన్నీ అబ్బురపరచి తన సుఖఃదుఃఖాలకు నిలువుటద్దంగా తన మనుగడ కోసం దేవుళ్ళు దేవతలను సృష్టి సృజన చేశాడు ఆలోచనలు విస్తరిస్తున్నా కొలది రకరకాల కళలు, గుహల్లో గీసిన చిత్రకళ లేఖనాలు డమరుకాలతో ఆడమగ నృత్యాలు జీవన వైవిద్యాలు మారుతూ సంగీతం మధురంగా గానం చేయడం, దేవతలు దేవుళ్ళ మూకుమ్మడిగా జాతరలు నిప్పురవ్వలను మండించి కాల్చిన మాంసం ఆరగించే క్రమంలో భూమిని చదును చేయడం నాగలితో దున్ని పంటలు పండించడం
కుమ్మరి సారేపై కుండలు చేయడం రంగురంగుల వస్త్రాల తయారీ
మనస్సు విరపూసిన కమలమై రకరకాల రక్షణా తంత్రులు మదిని మీటి
రకరకాల లేఖనాలు ,తాళపత్ర గ్రంధాలు,నియమాలు నిష్ఠలు తన జీవన పరిధి విస్తరిస్తున్నా కొలది కత్తులు బళ్ళాలతో యుద్దాలు వీటిలో నమ్మకాలు అపనమ్మకాలు మోసం ద్వేషం పగకుట్రలు కుతాంత్రాలు జీవితంలో భాగమయ్యాయి పరోపకారం ప్రేమ ఊసులు తాను మనిషిననే మానవత్వం,దైవారాధనలు జీవితం కొనసాగినంత మేరా మార్పులు చేర్పులతో నేటి నవీనీకరణలు చెందిన మానవుని వరకు మార్పులు చేర్పుల రకరకాల శాస్త్ర సాంకేతికతలన్నీ ఈ భూమ్మీద మానవుడు రూపొందించిన ప్రయోగాలు, కళలు ఆత్మీయతలు వినూత్న వెర్రిమొర్రి పోకడల్లో కాలప్రవాహం పరుగులు పెడుతూ సుదీర్ఘంగా సాగిపోయే నిరంతర ప్రక్రియ,,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular