సూర్యాపేట పట్టణ సీనియర్ సిటిజన్ సేవలు అభినందనీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో సూర్యాపేట పట్టణ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం వద్ద బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చుటకు చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వయోవృద్ధులు సైతం సమాజసేవలో పాలు పంచుకోవడం గర్వకారణమన్నారు. పట్టణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రతిరోజు దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయనట్లు తెలిపారు. ఆసక్తి గలవారు సంప్రదించవచ్చు అన్నారు. మజ్జిగ దాతగా సహకరి0చిన బోనగిరి రామమూర్తి, భాగ్యలక్ష్మిల జ్ఞాపకార్థం కుమారులు విజయకుమార్, నాగలక్ష్మి లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బైరు శైలేందర్, మాజీ కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, బైరబోయిన శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్ సీనియర్ సిటిజన్ సభ్యులు చారి, నరేంద్రుని విద్యాసాగర్ రావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
