అక్షరం ఎప్పుడూ జ్ఞానినె చేస్తుంది
వెలుగు పుంజాలతో మనస్సులోని మకిలిని తొలగిస్తుంది
ఇది కొందరి పతనానికి కారణం అక్షరమే
మిడి మిడి జ్ఞానంలో కొట్టుమిట్టాడుతు కొందరు
కొందరు ఉన్నత స్థాయి విద్యానార్జించినా
చేడు స్నేహితుల దాష్టీకంతో చదువులలో నిప్పులు పోసుకుని
అశ్లీల సాహిత్యం చాటుమాటుగా చదువుతూ
కామనాడులను ఉత్తేజ పరుస్తూ అభూత కల్పనలున్న అజ్ఞాన అక్షరాలు
మనస్సు లోని నాడులన్నీ బలహీనమై, ఆలోచనల నిండా అశ్లీల స్త్రీపురుషుల సంగమాలే తేలుతుంటే మనస్సు శరీరం యవ్వనంలొనే నిర్వీర్యమయ్యి నరాల్లో సత్తువ కోల్పోయి
జనంలో కలువలేక చూసే కళ్ళు అగమ్యగోచరంగా అశ్లీలతనే పరిపరి విధాలుగా పరికిస్తూ
చదివే చదువులు ఆ కామాగ్నిలో దహించుకుపోయి
జీవితం విరబూసే నల్లగులాబీలు నల్లపిల్లులు కళ్ల ముందు తేలియాడే అక్షరాల చిత్రాలు జీవిత పుటలు మనస్సు కామకోరికల కళ్ళు లేని పిశాచమై
కొంత వయస్సు దాకా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించి
పెళ్ళి చేసుకున్న భార్యను సుఖపెట్టలేని నిర్వీర్యునిగా తన భవిత తనను తాను మింగే భస్మాసుర హస్తమై
బ్రతకలేక చావలేక చాలీచాలని సంపాదనతన మకిలి జీవితంలో ఇమడలేక తను కట్టుకున్నది దుఃఖితురాలై
దుర్వ్యసనాలకు బానిసయై బ్రతుకు బ్రమల దుర్గంధమై
తనువులు చాలించే అమాయక అనామకూలు
చిన్నతనంలో అక్షరాల జ్ఞాని బంగరు రంగుల కలలు సాకారం చేసుకునే విజ్ఞాని అని కొనియాదిన లోకమే
మూర్ఖుడు మతిభ్రమించిన అజ్ఞాని అది తప్ప వేరే ప్రపంచం తెలీని మూఢుడు
జనం నోళ్ళల్లో పడి జీవించిన జీవితం ఎడారి ఇసుకల్లో ఎండమావుల్లో నీటికై బ్రతుకు గీసిన విషాద చిత్రం అక్షరం,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
