అక్షరాల పూవులతో మాలలల్లిన నక్షత్రాలు
పెనుచీకట్లు కొట్టుకుపోతున్న నక్షత్రాల క్రాంతి రేఖల్లో
పూవుల గుభాళింపుల్లో మకరందాలు గ్రోలే అక్షరాలు తుమ్మెదలై
చంద్రబింబం లేని రేయి సరసాలు పూయనంటున్న అక్షరాలు
ససేమిరా రాయమంటూ గోముచేస్తున్నాయి నక్షత్రాలు
తారలన్నీ మూకుమ్మడిగా ఉద్యమంలా తరలివస్తూ అక్షరాలు లిఖిస్తేనే జీవితమని ఉపిరులూదుతున్నాయి భయం భయంగా కళ్ళ లేఖినితో చాందినిలేని రేయి తారల గళాల ఆలాపనలు లిఖిస్తున్నా నీకు ఇంద్రభవంతులలో జోగేందుకు కుబేర కృపలో సన్నాసి నిశి నిషారాత్రులు సముద్రమంతా కన్నీళ్లు వున్నా చంద్రుని మోములా కురియాలి వెన్నెలలు హృదయంలో రాత్రిని మింగేసిన వెన్నెల సముద్రంలో మునకలేస్తున్నాయి అక్షరాలు
దివినిండా తారల గానలహరిలో ఆహ్లదంగా ఓలలాడుతున్నాయి మానవుల సంవేదనలు మాయమయ్యి భువిపై ఎటుచూసినా జిలుగు వెలుగుల అక్షరాల అందచందాల తోరణాలే
ఉగ్రరూపంతో కళ్ళు పలికే అక్షరాలు ఎదుటి వ్యక్తి హృదయం బ్రాంతుల చీకట్లను తొలగించి విధుల వాస్తవం తెలిపే చందమామలు రెండు కళ్ళు రెండు నక్షత్రాలు కవి అక్షరాలు,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట
